మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణ మంగళవారం ఉదయం హైదరాబాద్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,కెటిఆర్, పలువురు బిఆర్ఎస్, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీష్ రావు కుటుంబానికి సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే హరీష్ రావు నివాసానికి చేరుకున్న కెటిఆర్..సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు.
కాగా, హరీష్ రావుకు పితృవియోగం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.