హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. జనాల్ని మోసం చేసేందుకు రకరకాలుగా స్కెచ్‌లు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ బారీన పడి దాదాపు రూ.10 లక్షలు నష్టపోయాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అతడిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. లంగర్‌హౌస్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.10 లక్షలు కాజేశారు. సాయిప్రీతి అనే పేరుతో బాధితుడితో ఛాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టించారు. బాధితుడు పలు దఫాలుగా రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. లాభాలు విత్‌డ్రా కాకపోవడంతో అతడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.