ముంబై: బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఉందిర్‌ఖేడ్‌లోని తన ఇంట్లో సచిన్ ఈ నెల 23న ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఇంకో ఆస్పత్రికి మార్చారు. అయితే ఫలితం దక్కలేదు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 24న సచిన్ మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సచిన్.. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. ‘జాంతాడా 2’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.