ఒక సినిమా తెలుగు సినీ పరిశ్రమ ముఖ చిత్రం మార్చివేసింది. ఆ చిత్రం ప్రతీ సినీ అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. అసలు పాన్ ఇండియా సినిమా అనే ట్రెండ్‌ని ప్రారంభించిన సినిమా అది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఇంటది.. అదే ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ప్రపంచం ‘బాహుబలి’. 2015లో మొదటి భాగం విడుదల కాగా.. రెండో భాగం 2017లో వచ్చింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో విడుదల చేస్తున్నారు.
అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు రాజమౌలితో.. ప్రభాస్, రానాలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రభాస్.. ఈ రెండు చిత్రాల్లో తనకు ఏ భాగమంటే ఇష్టమని రాజమౌళిని ప్రశ్నించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అనే ప్రశ్నకంటే.. బాహుబలిని కట్టప్ప చంపేముందు పడే ఆవేదన నన్ను ఎంతో ప్రభావితం చేసిందని రాజమౌళి చెబుతారు. దీంతో పాటు సినిమాల్లోనే మరిన్ని సన్నివేశాలు గుర్తుః చేసుకొని సరదగా మాట్లాడుకున్నారు. ఆ వీడియోనే మీరూ చూసేయండి