డార్లింగ్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి పంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘వన్ బ్యాడ్ హాబిట్’ పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమాపై సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా స్పిరిట్ సినిమాలో సందీప్ చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఇందకు సంబంధించి కీలక సన్నివేశాలు ఉంటాయని.. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కథకు ప్రాణమని, మొత్తం సినిమాను మలుపు తిప్పి సన్నివేశం ఇదని తెలుస్తోంది. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
కొద్ది రోజుల క్రితం విడుదలైన స్పిరిట్ వీడియోతో సినిమాలో నటీనటులు ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.