హైదరాబాద్: పత్తి అమ్మకాల్లో నాణ్యత, తేమ శాతం చాలా ముఖ్యం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాణ్యత, తేమ శాతం రైతులు దృష్టి పెట్టుకోవాలి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తేమ ఎక్కువగా ఉంటే పత్తి రంగు మారి, నాణ్యత తగ్గిపోతుందని, పత్తి తేమ 12 శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదు అని తుమ్మల తెలియజేశారు. కేంద్రాల్లో ధర, తూకం, నాణ్యత విషయంలో పర్యవేక్షణ కమిటీలు ఉంటాయని అన్నారు. ఈ కమిటీలు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాయని, పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. రైతులు ఈ నిబంధనలను అనుసరించేలా అధికారులు చూడాలని, వారిని దళారుల బారిన పడకుండా కాపాడాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.