ఢిల్లీ: సైనిక అధికారినని నమ్మించి ఓ వైద్యురాలిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆరవ్ మాలిక్ అనే యువకుడు ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఓ వైద్యురాలితో ఆరవ్ మాలిక్ పరిచయం చేసుకున్నాడు. తాను ఆర్మీ అధికారిగా పని చేస్తున్నానని వైద్యురాలని నమ్మించాడు. సైనిక దుస్తులు ధరించి ఆమెకు ఫొటో పంపాడు. ఇద్దరు సోషల్ మీడియాలో చాటింగ్‌లు చేసుకోవడంతో సన్నిహితం పెరిగింది. రెండు రోజుల క్రితం మాలిక్ మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఆమె ఇంటికెళ్లి ఇచ్చాడు. ఆమె మత్తులోనికి జారుకున్న తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడు పారిపోయాడు. స్పృహలోనికి వచ్చిన తరువాత ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఆమెను నమ్మించడానికి అతడు ఆర్మీ దుస్తులు కొనుగోలు చేసి ఫోటో తీసి వైద్యురాలికి పంపించానని ప్రాథమిక విచారణలో తెలిపాడు. గతంలో ఎవరిపైన అత్యాచారం చేశాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.