హైదరాబాద్: పూజల పేరుతో డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల గల ముఠాను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక ఎయిర్ గన్ (పిస్టల్), ఒక కత్తి తో పాటు 8లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 18 న దుండిగల్ లోని ఓ ఇంట్లో పూజల పేరుతో నలుగురు వ్యక్తులు నమ్మబలికి, ప్రసాదం లో మత్తుమందు కలిపి కుటుంబ సభ్యులకు ఇచ్చారన్నారు. వాళ్లు నిద్రలోని జారుకున్న తరువాత రూ. 8.5 లక్షల నగదును నిందితులు దోచుకెళ్లారన్నారన్నారు. ఈ రోజు నిందుతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని డిసిపి వెల్లడించారు.