చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ ‘బైకర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శక త్వం వహిస్తుండగా, ప్రతిష్టాత్మకమైన యూవీ క్రి యేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్న శర్వా తన పాత్ర కోసం జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రా న్స్‌ఫర్మేషన్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్ స్టిల్స్ లో కొత్త శర్వా కనిపించారు. శర్వా తన పాత్రకు సరిపడేలా లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దారు. చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.