హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో బ్యాటింగ్‌లో మెరిశారు. రోహిత్ సెంచరీతో పాటు హాఫ్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రెండు మ్యాచ్ డకౌట్ రూపంలో వెనుదిరుగగా మూడో మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో రాబోయే వరల్డ్ కప్ వారి స్థానాలు పదిలమని క్రికెట్ పండితులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగి వరల్డ్ కప్ సినీయర్ల అనుభవం పనికి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సునీల్ గావస్కర్ ఇద్దరు సీనియర్లు మద్దతుగా మాట్లాడారు. వరల్డ్ కప్ టీమ్‌లో రోకో పేర్లు బుక్ అయ్యాయని తెలిపాడు. ఫిట్‌నెస్ లేదా గాయపడితే తప్ప వాళ్లిదరి స్లాటులు బుక్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న రిథమ్‌ను చూసిన వారెవరైనా అదె మాట చెబుతారన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం జరిగిన రోకో పేర్లు మాత్రం వరల్డ్ కప్ స్కాడ్‌లో ఉండాల్సిందేనని సునీల్ స్పష్టం చేశారు.