హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెంగళరావునగర్ డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ ఉపఎన్నికతో భారత రాష్ట్ర సమితి కథ పరిసమప్తం కాబోతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించేదిగా ఆయన పేర్కొన్నారు. ఓటర్ల చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ పాలనలో విధ్వంసం జరిగిందని.. ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి సిఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని.. జూబ్లీహిల్స్ ఓటర్లంతా సిఎంకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికుడిగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని.. తద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.