నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌కి మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకు ముందు నిర్వహించిన టాస్‌లో భారత్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్ రమ్మని ఆహ్వానించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ని 43 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గడంతో తొలుత బ్యాటింగ్ ఆరంభించిన ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రేణుక వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి సుమైయా అక్తర్(2) శ్రీచరణికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత దీప్తి వేసిన 10వ ఓవర్ మూడో బంతికి మరో ఓపెనర్ రుబ్య హైదర్ జెలిక్(13) హర్లిన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత కొంత సమయానికి వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం 12.2 ఓవర్లలో బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో షర్మిన్ అఖ్తర్(18), నిగర్ సుల్తానా(2) ఉన్నారు.