ఢిల్లీ: బ్రిటీష్ వారి దోపిడికి అంతులేకుండా ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. అప్పట్లో హైదరాబాద్ ప్రజలపై దమనకాండ తీవ్రంగా ఉండేదని అన్నారు. మన్ కీ బాత్ లో కొమురం భీంను మోడీ కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపైనా, బ్రిటీషర్ల అకృత్యాలపైనా.. 20 ఏళ్ల వయసులో కొమురం భీం ఉద్యమించారని అన్నారు. జనం భూములు నిజాం లాక్కునేవాడు, పన్నులతో వేధించేవాడని మండిపడ్డారు. నిజాం పోలీసు అధికారిని కొమురం భీం చంపారని, అరెస్టు కాకుండా కొమురం భీం తప్పించుకుకోగలిగారని మోడీ తెలియజేశారు. ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా ఆదివాసీల మనస్సుల్లో కొమురం భీం సుస్థిరస్థానం సంపాదించారని, కొమురం భీం నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు.