ఆసియా కప్‌లో అంతగా రాణించకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కింది.ఈ విషయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని వెనకేసుకు వచ్చారు. అయితే ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ హర్షిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో గంభీర్.. హర్షిత్‌కి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. తర్వాత మ్యాచ్‌లో సరిగ్గా ఆడపోతే.. జట్టు నుంచి తీసేస్తానని గంభీర్ హెచ్చరించారని హర్షిత్ చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించారు.
హర్షిత్ మ్యాచ్‌కి ముందు తనకు ఫోన్ చేశాడని.. తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాడని శ్రవణ్ అన్నారు. దీంతో ‘‘నిన్ను నువ్వు విశ్వసించు’’ అని చెప్పానని తెలిపారు. కొందరు క్రికెటర్లు గంభీర్‌కి సన్నిహితులను బయట టాక్ నడుస్తోంది. కానీ, ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తించి.. వారికి మద్దతుగా గంభీర్ ఉంటాడని పేర్కొన్నారు. గంభీర్ మద్ధతుగా నిలిచిన క్రికెటర్లు కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు చేశారని తెలిపారు. హర్షిత్‌ని నిజానికి తీవ్రంగా మందలించారు. అతడి ఇంకా23 ఏళ్లే.. నెమ్మదిగా నేర్చుకుంటాడు అని శ్రవణ్ అన్నారు.