అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామ శివారులో ఇటుకల బట్టి వద్ద నిద్రిస్తున్న సమయంలో దంపతుల తలలను దుండగులు పగలగొట్టి చంపారు. హత్యకు గురైన వారు నాగప్ప, పెద్దక్కలుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.