ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఓడినప్పటికీ.. చివరి వన్డేలో మాత్రం భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే ఈ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. చివరి వన్డేలో క్యాచ్ అందుకొనే క్రమంలో అతడి ప్రక్కటెముకలకు గాయమైంది. దీంతో డాక్టర్లు అతడిని నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇదే జరిగితే సౌతాఫ్రికా సిరీస్‌కి శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉంది.
ఓ బిసిసిఐ సీనియర్ అధికారి దీనిపై మాట్లాడుతూ.. మ్యాచ్ జరుగుతుండానే శ్రేయస్‌ని స్కానింగ్‌లకు పంపించామని తెలిపారు. ‘‘ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. శ్రేయస్ ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది. అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది. ఇది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టొచ్చు. సౌతాఫ్రికా సిరీస్‌కి అతడు అంటుబాటులో ఉండాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది’’ అని అన్నారు.