అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో ట్విస్ట్ నెలకొంది. శివశంకర్ బైక్ ప్రమాదంపై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్ ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి ఫిర్యాదు చేశాడు. శివశంకర్ బైక్‌పై వెనక ఎర్రిస్వామి కూర్చున్నాడు. బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో శివశంకర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్వల్పంగా గాయపడిన ఎర్రిస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎర్రిస్వామి ఫిర్యాదుతో మృతిచెందిన శివశంకర్‌పై కేసు నమోదు చేశారు. 281, 125(a), 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివశంకర్‌తో కలిసి మద్యం సేవించానని ఎర్రిస్వామి తెలిపాడు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందన్నారు. శివశంకర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడని వివరణ ఇచ్చాడు. రోడ్డపై ఉన్న బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలోకి వచ్చిందన్నాడు. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.