ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం నుంచి నా ప్రాణమంత అనే పాట విడుదలైంది. సింగర్ కాలభైరవ పాడిన ఈ పాట డైరెక్టర్ కృష్ణచైతన్య చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ “కాలభైరవతో కలిసి పనిచేశాను. దేవ్ పారు మూవీ ఒక ఫ్రెష్, ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ప్రొడ్యూసర్ అలీఖాన్ మాట్లాడుతూ “ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ కాలభైరవ ఒక పాటను పాడడం విశేషం. ఆయన పాట, లిరిక్స్, మ్యూజిక్ అన్నీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలోని లవ్ స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి”అని చెప్పా రు. దర్శకుడు అఖిల్ రాజు మాట్లాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మిహాస్ రోమి, దర్శకుడు అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియా పాల్గొన్నారు.