లక్నో: ఉత్తర ప్రదేశ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంఎల్ఎ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. యమునా నదిని బిజెపి సర్కార్ శుభ్రం చేసిందని బిజెపి ఎమ్మెల్యే రవి నేగి చూపించేందుకు ప్రయత్నించి బోల్తాపడ్డారు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపుకొని ఇదిగోండి నీళ్లు ఎంతో శుభ్రంగా ఉన్నాయని నమ్మించాడు. తీరా చూస్తే.. అప్పటికే వాటర్ బాటిల్‌లో శుభ్రమైన నీళ్లు ఉండటం వీడియోలోనే కనిపించడంతో సదరు ఎంఎల్ఎపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో బిజెపి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే యమునా నీళ్లు శుభ్రంగా ఉంటే అవి తాగి చూపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అబద్దాలు ప్రచారం చేయడంతో బిజెపి మించిన వాళ్లు దేశంలో లేరని కామెంట్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అబద్దాలకు మారుపేరు గోడీ మీడియా పునితన్ 3001 అనే నెటిజన్ చురకలంటించారు. ప్రజలను అబద్దాలతో ఎన్ని రోజులు మభ్య పెడుతారని ప్రశ్నిస్తున్నారు. నకిలీ యుద్ధాలు, నకిలీ వాగ్దానాలు, నకిలీ ఆత్మగౌరవం, నిజమైనది వారి బడ్జెట్ మాత్రమేనని తంగో చార్టీ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. ‘వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర వాట్స్ యాప్ యూనివర్సిటీ ఉన్నంత వరకు భక్తులు మోసపోతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మోడీ భక్తుల ఆధిపత్యం ఉన్న మరొక సోషల్ మీడియా ప్రపంచం. ఎక్స్ లో చాలా మంది తెలివితక్కువవారు కాదు. నిజమైన తెలివితక్కువవారు ఇన్‌స్టా, వాట్సాప్‌లో ఉన్నారు’ అని కాస్మిచోస్ (@karmicoder) అనే నెటిజన్ కామెంటు చేశాడు. సదరు ఎంఎల్ఎ నిజంగా ఆ నదిని ప్రేమిస్తే, దాని నీరు శుభ్రంగా ఉందని ఎప్పుడూ చెప్పడు, అది మురికిగా ఉందని, దానిని శుభ్రం చేయాలని చెబుతారని ఎంఎన్ టి అగ్రి అనే నెటిజన్ సలహా ఇచ్చాడు.