లక్నో: మత్తు మందు కలిపిన టీ తాగించి బాలికపై ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 18 ఏళ్ల యువతితో ఇద్దరు యువకులు స్నేహంగా ఉండేవారు. ఆమెను ఓ ప్లాట్‌కు తీసుకెళ్లి ఆమెతో మత్తు పదార్థం కలిపిన టీ తాగించారు. అనంతరం ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహలోనికి వచ్చిన తరువాత ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.