ఇండోర్: మహిళ ప్రపంచ కప్ టోర్నీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంగ్లండ్, భారత్ సెమీస్ చేరుకున్నాయి. అయితే సెమీస్ ఎవరూ ఎవరితో తలపడనున్నాయనే సందిగ్ధత తొలిగి పోయింది. ఐసిసి నిబంధన ప్రకారం పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. రెండో, మూడు స్థానాల్లో నలిచిన జట్లు రెండో సమీస్‌లో తలపడనున్నాయి.
అయితే, ఇండోర్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో అలనా కింగ్(7-18) సంచలన బౌలింగ్‌తో ప్రతర్థిని కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 17వ ఓవర్లోనే ఛేదించింది ఆసీస్. బేత్ మూనీ(42) ఔటైనా.. సథర్‌లాండ్(10 నాటౌట్) రెండు ఫోర్లు బాదడంతో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది కంగారూ టీమ్. ఈ విజయంతో 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం కాపాడుకున్న ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది. ఇక రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపనున్నాయి. కాగా, లీగ్ చివరి మ్యాచ్ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది.