మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నియమితులైన సూపర్‌వైజర్లంతా త మ వృత్తి ధర్మాన్ని నిబద్దతతో పాటించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శా ఖ మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తే మీ చే తుల్లో ఉన్నందున మీ వృత్తి ధర్మం ప్రజల ఆశలు, అవసరాలకు తగినట్టుగా ఉండాలని కొత్త సూపర్‌వైజర్లకు మంత్రి మార్గదర్శనం చేశారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క శనివారం స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి చ్చేసిన మంత్రి సీతక్క,
మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తో కలిసి కొత్తగా నియమితులైన సూపర్వైజర్లను అభినందిస్తూ, వేల మందితో పో టీ పడి మీరు సాధించిన ఈ కొలువులు మీ కష్టానికి ప్రతిఫలం. మీ నిరీక్షలు ఫలించాయి, మీ ఉద్యోగ కలలను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ఒక్కో సూపర్‌వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని, ఎక్కడా చిన్న లోపం లేకుం డా ఆయా కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పౌష్టికాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్య ను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. మ హిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అం గన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె అన్నారు.
తెలంగాణ నుంచే అంగన్వాడీ కేంద్రాలకు బీజం పడింది
ఐసిడిఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ గారు ప్రాణం పోశారని అ న్నారు. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయని గుర్తు చేశారు. 1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని అన్నారు. అంగన్వాడీ హెల్పర్ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈ రోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువేనని తెలిపారు. ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలని సీతక్క పేర్కొన్నారు. అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయని వివరించారు. చిన్నారుల కోసం 57 రకాల ఆటవస్తువులు,
యూనిఫాంలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాం. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని తెలిపారు. నియామక పత్రాలు అందుకునే సమయంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటు ంబ సభ్యులు, పిల్లలను హత్తుకొని ఆనంద భాష్పాలు కార్చారు. వారి కళ్లల్లో ప్రతిఫలించిన ఆనందం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, మంత్రి సీత కనితిత్వంలోని మహిళా సంక్షేమ శాఖ పనితనానికి నిదర్శనంగా నిలిచింది.
పటిష్టమైన సమాజం అంగన్వాడీల్లోనే నిర్మితమవుతుంది
మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ పటిష్టమైన సమాజం అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. మహిళల కు పెద్దదిక్కుగా ఉన్న సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండటం ఆ శాఖలోని సిబ్బంది అదృష్టమని పేర్కొన్నారు. సీతక్క స్ఫూర్తితో సూపర్వైజర్లంతా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నియామక పత్రాలు అందుకు న్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూపర్వైజర్లు విధి నిర్వహణలో అత్యంత నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు.