మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. గతంలో కంటే కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీకున్న తెలివితేటలతో ఓర్పుతో సహనంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలను అని నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. సంతానం యొక్క చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కాలభైరవ రూపు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎరుపు.
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా గ్యాస్ట్రిక్ అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కళారంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా సహోద్యోగులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టమైనది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.
మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ ఈ వారం చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు విదేశాలకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఏర్పడినటువంటి అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి-ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా చెప్పుకోదగిన స్థాయిలో సమస్యలు ఏర్పడవు. ఉద్యోగ పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంత నిర్ణయాలు ఒక్కోసారి కలిసి రాకపోవచ్చు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓంనమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
కర్కాటక రాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే కూడా బాగుందని చెప్పవచ్చు. మీరు ఏపని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాణించ గలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ కార్తిక మాసంలో ఓం నమశివాయ భక్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులు పెడతారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఈ కార్తీకమాసంలో ఉదయం సాయంత్రం ప్రతి రోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన లాభాలకు సమానంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. దూర ప్రయాణాలలో చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ప్రతి నిత్యం ఓం నమశివాయ వత్తులతో నువ్వులనూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్.
తులా రాశి వారికి గతవారం కంటే ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు అప్లై చేసిన లోన్లు మంజూరు అవుతాయి. భూ సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. ఈ వారం పొదుపు కూడా చేయగలుగుతారు. కొంతమేరకు అప్పులను తీర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానాచలం కోరుకున్న వారికి కోరుకున్నట్టు జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్థాయి. వివాహ ప్రయత్నాలు కొంత నెమ్మదిగా జరుగుతాయి. సంతానం పట్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ దక్కుతాయి. ఈ రాశి వారికి నూతన గృహ యోగం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి మనసును అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి జాగ్రత్త వహించండి. అన్నీ నాకే తెలుసు అనే భావనను పక్కనపెట్టి స్థిమితంగా ఆలోచించడం మంచిది. లేకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి బ్యూటీషియన్స్ కి టెక్నీషియన్స్ కి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. ఈ కార్తీకమాసంలో మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ .
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు 10 శాతం కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం సరైన సమయం. అదేవిధంగా ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా కలిసివచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి జాగ్రత్త వహించండి. అదేవిధంగా విదేశీయాన సంబంధిత విషయ వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ వారికి సినీ కళా రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు సైతం మంచి లాభాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మీరు చేపట్టే ప్రతి పని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో నువ్వులు నూనెతో దీపారాధన చేయడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోకుండా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు తెలుపు.
ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. దూర ప్రాంత ప్రయాణాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. అనుకోని అవార్డ్స్ రివార్డ్స్, అతిధి మర్యాదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం ముందుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఎక్కువగా పొగిడే వారు ఉంటారు వారి పట్ల జాగ్రత్త వహించండి. పదిమందికి ఏదో విధంగా సహాయ పడాలనే ఆలోచన నెరవేరుతుంది. నూతన గృహ యోగం ఉంది రియల్ ఎస్టేట్ వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ కు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది.ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ రాశి వారిపై ఈర్షద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది దీనికోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే శని స్తోత్రం కూడా చదవండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా లేవు సొంతంగా వ్యాపారం చేసుకోవడం మంచిది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలి. లేదా ఆప్త మిత్రులు లేక స్నేహితుల సలహాలు తీసుకోవాలి. కానీ నిర్ణయంమాత్రం మీదే అయ్యుండాలి. అలాగే సంతాన సంబంధిత వ్యవహారాలు కూడా బాగున్నాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో లావాదేవీలు నిలకడగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.
కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చే వేస్తారు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ
మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఈ కాలంలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెడతారు. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.