మాక్స్‌టన్ ( అమెరికా) : ఆగ్నేయ నార్త్‌కరోలినాలో వారాంతపు పార్టీ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 13 మంది కాల్పులకు బలయ్యారని రోబ్‌సన్ కౌంటీ షెరీఫ్‌బర్నిస్ విల్కిన్స్ కార్యాలయం వెల్లడించింది. మాక్సటన్ అవతల 150 కిమీ దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఈ పార్టీ వేడుకలు జరిగాయని, కాల్పులు జరగడంతో అక్కడ నుంచి 150 మంది కన్నా ఎక్కువ మంది పారిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.