అమరావతి: కడప జిల్లా రాజుపాలెం మండలం వెల్లాలలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధ దంపతులు కుందూనదిలో దూకారు. భర్తను స్థానికులు రక్షించగా, భార్య గల్లంతయ్యింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్లూరు వాసులు రామసుబ్బారెడ్డి( 79), నాగమునెమ్మ(75) గా పోలీసులు గుర్తించారు.