సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 28 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 171 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారత జట్టు ముందు 237 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇంకా 66 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 24 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(78), విరాట్ కోహ్లీ(52) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ 75వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్-విరాట్ కలిసి 19 సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. వంద పరుగుల భాగస్వామ్యంలో 99 సార్లతో సచిన్ తొలి స్థానంలో ఉండగా విరాట్ 82 సార్లు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.