అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో 19 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ప్రమాదానికి ముందు పెట్రోల్‌బంకులోనికి ద్విచక్రవాహనదారుడు వెళ్లాడు. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ తన స్నేహితుడితో కలిసి బంక్‌కు వెళ్లాడు. శివ బంకులో మద్యం మత్తులో ఊగుతూ కనిపించాడు. బైక్‌ను వెనక నుంచి లాగి వాహనాన్ని స్టార్ట్ చేశాడు. ముందుకు వెళ్లిన తరువాత బైక్ స్కిడ్ కావడంతో కిందపడిపోయాడు. దీంతో అతడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సులో ప్రమాదంలో శివశంకర్ కూడా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.