హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతం బండగూడ జాగీర్ సమీపంలోని హైదర్ షాకోట్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హైదర్ షాకోట్ చౌరస్తా లో కృష్ణ అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది. కారు కింద నలిగి కృష్ణా ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ కారు ఆపకుండా అతివేగంతో పారిపోయాడు. వాహనదారులు చూస్తుండగా కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు కారును పట్టుకొనే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మితిమీరిన వేగంతో కారుతో సహా పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష గాంధీ ఆస్పత్రికి తరలించారు.