లక్నో: ఆరేళ్ల కూతురుపై గే పార్ట్నర్ అత్యాచారం చేయడంతో అతడి ప్రైవేట్ పార్ట్ ను తండ్రి కట్ చేశాడు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డయోరియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి ఆర్కిస్ట్రాలో పని చేస్తూ భార్య, కూతురును పోషిస్తున్నాడు. భార్యతో విబేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అతడు రాంబాబు యాదవ్ అనే వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. రాంబాబు యాదవ్, అతడు శారీరకంగా కలిశారు. ఇద్దరు కలిసి గే పార్ట్నర్ గా ఉన్నారు. తండ్రి ఉంటున్న ఇంటికి కూతురు వచ్చినప్పుడు యాదవ్ ఇంట్లోను ఉన్నాడు. బాలికపై యాదవ్ అత్యాచారం చేసినట్టు ఆరోపణ. ఈ విషయం తండ్రికి తెలియడంతో యాదవ్‌ను చితక బాది అనంతరం ప్రైవేట్ పార్ట్‌ను కోశాడు. స్థానికులు రాంబాబు యాదవ్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మధ్య ఉన్న సంబంధం బయటకు తెలుస్తే పరువు పోతుందనే భయంతో తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.