అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో 140 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. టాటా నగర్- యశ్వంతపూర్ రైలులో తనిఖీలు చేస్తుండగా గంజాయి కనిపించింది. 15 బ్యాగులలో రూ.7 లక్షల విలువైన 140 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.