మన తెలంగాణ/హైదరాబాద్: క్షణాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకున్న ప్రయాణికులు నిద్రలోనే విగతజీవులుగా మారారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. హైదరాబాద్ నుంచి బెం గళూరుకు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రై వేట్ బస్సును (నంబర్ 01 ఎన్ 9490) బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్ర యాణికులు గాఢనిద్రలో ఉండటంతో తేరుకునేలో పే బస్సు దగ్ధమైపోయింది. ఆ సమయంలో బస్సు లో 43మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబా ద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును కర్నూలు శివారులోని చిన్నటేకూరులో హైవే 44 పై ఓ బైక్ ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బైక్ బస్సు కిందకు దూసుకెళ్లడం తో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తం వ్యాపించి చూస్తుండగానే బస్సు అగ్నికి ఆహుతైంది.
ప్రమాద సమయంలో బస్సులో మొ త్తం 44మంది మంది ఉండగా 19మంది సజీవ దహనమయ్యారు. మృతిచెందిన వారిలో ఆరుగు రు తెలంగాణ వాసులున్నారు. హైదరాబాద్ నుం చి బెంగళూరు బయలుదేరిన ఈ బస్సు, కర్నూలు శివారులోకి రాగానే ఓ బైక్ అతివేగంతో బస్సును వెనక నుంచి ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు పెట్రోల్ ట్యాంకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసేలోపే మంటలు బస్సు అంతా వ్యాపించాయి. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు కాగా వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువు రు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు పోలీసులు, రవాణాశాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
హైదరాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు బ యలుదేరిన బస్సు తెల్లవారుజామున 3.30 ప్రాం తంలో చిన్నటేకూరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయిందని కర్నూ లు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మం టలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తానికి వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ దెబ్బతినకపోయినా, ముం దు భాగంలో మంటలు తీవ్రంగా చెలరేగినట్లు డీఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైక్ క ర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్‌ది అని, ఆ యన అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో అత్యవసర ద్వారం పగలగొట్టి 12 మంది బయట పడగలిగారు. వీరిని సమీపంలోని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో సత్యనారాయణ, శ్రీల, నవీన్‌కుమార్, అఖిల్, హారిక, జ ష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. మరో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, లక్ష్మయ్యలుగా గుర్తించా రు. ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. బ స్సు నడిపిన డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్డు పై పడి ఉన్న బైకును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్ చెప్పాడని, అయితే అంతకుముందే ప్రమాదంలో బైక్ పడిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రయాణికుల జాబితా ఇదే..
బస్సులో ఉన్నవారిలో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి (27), కీర్తి (30), పంకజ్ (28), యువన్ శంకర్‌రాజు (22), తరుణ్ (27), ఆకాశ్ (31), గిరిరావు (48), బున సాయి (33), గణేశ్ (30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41), రమేష్, అనూష, మహ్మద్ ఖైజర్, దీపక్ కుమార్, నవీన్‌కుమార్, ప్రశాంత్, సత్యనారాయణ్, మేఘనాథ్, వేణు గుండ్, చరిత్, చందన మంగ్, సంధ్యారాణి మంగ్, గ్లోరియా ఎల్లెస శ్యామ్, సూర్య్, హారిక్, శ్రీహర్ష్, శివ్, శ్రీనివాసరెడ్డ్, సుబ్రహ్మణ్య్‌ం, అశోక్, రామారెడ్డ్, ఉమాపతి్, అమృత్ కుమార్, వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
కర్నూలు కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా పరిపాలన తరఫున పలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ : 08518-277305, కర్నూలు ప్రభుత్వాస్పత్రి : 9121101059, ఘటనా స్థలిలో హెల్ప్‌లైన్: 9121101061, పోలీస్ కంట్రోల్ రూమ్: 9121101075, జనరల్ ఆస్పత్రి హెల్ప్‌డెస్క్ : 9494609814, 9052951010 ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
కర్నూల్ జిల్లా బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
మృతులకు రూ.5 లక్షల పరిహారం
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపింది.
ఎపి సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబా య్ పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు వివరాలు అందచేశారు. వెంటనే సీఎస్, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ఘ టనాస్థలికి ఉన్నతాధికారులను పంపించాలని కూ డా ఆదేశించారు. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ బస్సులపై ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశించారు.
16 బృందాలతో దర్యాప్తు: హోం మంత్రి అనిత
బస్సు ప్రమాదంపై 16 బృందాలతో దర్యాపు ్త చేస్తున్నామని ఎపి హోం మంత్రి అనిత వెల్లడించారు. కర్నూలులో బస్సు ప్రమాదం జరగడం భాదాకరమని అన్నారు. మృతి చెందిన వారిలో ఏపీకి చెందిన మృతులకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మం త్రులు అనిత, రాం ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, చనిపోయిన వ్యక్తుల డీఎన్‌ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని మంత్రి అనిత అన్నారు.
మృతుల్లో తల్లి, కుమారుడు
ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రం, కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన కృషి డిఫెన్స్ కాలనీ నుంచి బయలుదేరిన తల్లి, కొడుకు ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ సంఘటన తెలియడంతో కాలనీలో విషాదఛాయ లు అలుముకున్నాయి. ఫీల్ మన్ బేబీ (65), ఆమె కుమారుడు కిశోర్ కుమార్ (43) పటాన్‌చెరులోని తమ అక్క పద్మప్రియ, బావ రాము ఇంటికి దీపావళి పండగ సందర్భంగా వచ్చారు. పండుగ అనంతరం వీరిద్దరూ గురువారం రాత్రి పటాన్‌చెరులోని అంబేద్కర్ చౌరస్తా వద కావేరి ట్రావెల్ బస్సులో బెంగుళూరు బయల్దేరారు. బెంగళూరులోని వారి స్వగృహానికి చేరకముందే మార్గమధ్యంలోనే కర్నూల్ జిల్లాలో బస్సు అగ్ని ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అదేవిధంగా ప్రమాదానికి గురైన బస్సులో బీరంగూడలో ఎక్కిన అశ్విన్‌రెడ్డి అనే యువకుడు ఉప్పల్ ప్రాంతానికి చెందినట్లు తెలుస్తోంది.
తల్లి, కుమార్తె సజీవ దహనం
కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామను జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లా, శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (43), ఆమె కూతురు చందన (23) సజీవదహనమయ్యారు. సంధ్యారాణి కుటుంబంతో సహా బంధువుల వివాహం కోసం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తన కొడుకు శ్రీ వల్లభ్ ఉత్తరప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదువుతుండటంతో వెంటనే వెళ్లిపోగా ఆమె భర్త ఆనంద్‌కుమార్‌గౌడ్ దుబా య్ వెళ్లారు. అయితే, సంధ్యారాణి స్వల్ప ఆనారోగ్య కారణంగా దుబాయ్ ప్రయాణం వాయిదా వేసుకుని బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తు న్న తన కూతురు చందనను బెంగుళూరుకు పం పేందుకు తోడుగా వెళ్లింది. బెంగుళూరు నుంచి సంధ్యారాణి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుని తల్లి, కుమార్తెలు ఇద్దరూ సజీవదహనమయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త, కుమారుడు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబంతో పాటు స్వగ్రామమైన శివ్వాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమ్మా.. ఇంటికి వస్తున్నా అన్నాడు..
అంతలోనే విగతజీవిగా మారాడు!
తన పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానని శివశంకర్ చెప్పాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో బైక్ నడిపిన శివ శంకర్ కర్నూలు పట్టణంలోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తి. ఈ సందర్భంగా శివశంకర్ కుటుం బ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. శివశంకర్ గ్రానైట్ పనికి వెళ్తాడని, గురువారం రాత్రి ఇంటికి వచ్చాడని తల్లి యశోద చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. శుక్రవారం తెల్లవారుజామున పని కోసం వెళ్లాడని తెలిపింది. శివశంకర్ ఎక్కువగా గ్రానైట్ పనులకి పల్స ర్ బైక్ పైనే వస్తుండేవాడని, ఆ బైక్‌నే శివశంకర్ వినియోగిస్తుంటాడని యజమాని పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనూషరెడ్డి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూ లు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదా ద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనూషరెడ్డి సజీవ దహనమైంది. అనూష మరణంతో ఆమె స్వగ్రామం గుండాల మండలం, వస్తకొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వస్తకొండూరు గ్రామానికి చెం దిన మహేశ్వరం శ్రీనివాస్‌రెడ్డిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అతనికి ఇద్దరు కుమార్తెలు. రెండవ కూతురు అనుష బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ దీపావళి పండుగ సందర్భంగా వస్తాకొండూర్‌కు వచ్చి బెంగళూరు వెళ్తుండగా కర్నూల్ పట్టణ ప్రాంతంలో ప్రమాదానికి గురై మృతిచెందిది. నిన్నటివరకు గ్రామంలో ప్రజలతో కలివిడిగా తిరిగి.. గురువారం సాయం త్రం బెంగళూరు బ యలుదేరిన అనూష మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు కన్నీరు ము న్నీరయ్యారు. ఆమె మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూల్‌కు బయలుదేరారు.