నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వీకర్ సెక్షన్‌లో సీతక్క శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కార్పొరేషన్ చైర్మన్లు మువ్వ విజయ్ కుమార్, బండ్రు శోభారాణితో కలసి మంత్రి ప్రచారం కొనసాగించారు. మంత్రి సీతక్క ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఓటర్లకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ను
గెలిపిస్తే ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందని వివరించారు. మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ను గెలిపించారని, కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. ఇండ్లు లేని నాలుగున్నర లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. టిఆర్‌ఎస్ హయాంలో కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి సీతక్క ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే తాము 15 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.