దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ఇద్దరు ఐఎస్‌ఐఎస్ సంబంధిత అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ఒక మాల్‌లో, పబ్లిక్ పార్కులో దీపావళి నాడు ఆత్మాహుతి దాడులకు వీరు ప్లాన్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఢిల్లీ లోని సాదిక్ నగర్ లోను, భోపాల్ లోనూ ఢిల్లీ సూపర్ సెల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. వీరిద్దరూ ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న అనుమానిత ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్ కాగా, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఢిల్లీలో ఓ పెద్ద ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారి నుంచి ఆయుధాలు , మందుగుండు సామగ్రితోపాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను వీడియోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆ వీడియోలో వారు ఐఎస్‌ఐఎస్‌కు విధేయత ప్రమాణం చేస్తున్నట్టు ,
ఢిల్లీలో ఎక్కడ ఉగ్రదాడికి పాల్పడాలనుకున్నారో ఆ ప్రదేశాల ఫోటోలు చిత్రీకరించి ఉన్నాయి. టైమ్ బాంబు తయారు చేయడానికి కావలసిన పేలుడు సదార్ధాలను, వాటిని ఎక్కడ సేకరించారో ఆ ఫోటోలు , అవన్నీ స్వాధీనం చేసుకోవడమైందని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుష్వాహా పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. ఎక్కడ దాడి చేయాలనుకున్నారో ఆ ప్రాంతాల్లో నిందితులు రెక్కీ నిర్వహించారని చెప్పారు. అక్టోబర్ 16న సాదిక్ నగర్ లో ఒక నిందితుడిని, మరో నిందితుడిని భోపాల్ నుంచి అరెస్టు చేసినట్టు చెప్పారు. భోపాల్‌కు చెందిన అద్నాన్ తాను జ్ఞానవాపి మసీదు సర్వే చేస్తున్న ఆర్కెయాలజీ సర్వే ఆఫ్ ఇండియా ( ఎఎస్‌ఐ) అధికారినని సోషల్ మీడియాలో బెదిరించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మరింత సమాచారం తెలుసుకొనేందుకు విచారిస్తున్నామని, వీరి మొత్తం నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు.