ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ నటుడు, ఎపి సిఎం చంద్రబాబునాయుడి సోదరుడి కుమారుడు నారా రోహిత్ సమావేశం అయ్యారు. ఈనెల 30న జరిగే తన వివాహానికి రావాలని నారా రోహిత్ సిఎం రేవంత్‌ను ఆహ్వానించారు. కాగా, నటి శిరీషను నారా రోహిత్ ఈనెల 30న పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి మొదలయ్యే హల్దీ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 26వ తేదీన పెళ్లికొడుకు వేడుక, 28వ తేదీన మొహంది వేడుక జరగనుండగా 30వ తేదీన రాత్రి 10.35 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వారి వివాహం జరగనుంది. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, ఈ వేడుకలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో సహా, పలువురు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.