నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్‌కి పూనకాలు రావాల్సిందే. ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యారు. ఈ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం ‘అఖండ 2 తాండవం’. 2021లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. తాజాగా బ్లాస్టింగ్ రోర్ అంటూ చిన్న టీజర్‌ని వదిలింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో బాలకృష్ణ, బోయపాటి స్టైల్‌లో యాక్షన్ అదరగొట్టారు. ‘‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కి నవ్వుతానో.. ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు’’ అంటూ బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్‌తో కేక పెట్టించారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం తేజస్విని సందమూరి సమర్పణలో ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.