ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బిసిసిఐ సెలక్టర్లు చేసిన ఓ పని క్రికెట్ అభిమానులకు షాక్ ఇఛ్చింది. ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మను పక్కన పెట్టి యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టన తొలి సిరీస్‌లోనే గిల్‌కు చేధు అనువం ఎదురైంది. ఆస్ట్రేలియాలో అతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరస్‌లో భారత్ 0-2 తేడాతో భారత్ ఓటమిపాలైంది. అయితే రోహిత్‌ని తప్పించి గిల్‌కు కెప్టెన్సీ అప్పగించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.
రోహిత్ ఏం తప్పు చేశాడని.. అతడిని తొలగించి తనకు కెప్టన్సీ ఇచ్చారని గిల్ రోజు ఆలోచిస్తుంటాడని కైఫ్ పేర్కొన్నారు. ‘‘రోహిత్ ఇప్పటికే నాయకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. అతడి సారథ్యంలో గిల్ ఆడాడు. కెప్టెన్‌గా రోహిత్ ఎలాంటి తప్పు చేయలేదని గిల్‌కి బాగా తెలుసు. అయినా సరే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారనీ తెలుసు. హోటల్ రూంలో నిద్రకు ఉపక్రమించే ముందు బాహుశా గిల్ ఇదే అనుకుంటూ ఉంటాడు. ‘రోహిత్ భయ్యా ఎలాంటి తప్పు చేయలేదు. అయినా ఎందుకిలా చేశారు?’’ అని కైఫ్ అన్నారు.