హైదరాబాద్: నిరుద్యోగ బాకీ కార్డు విడుదల చేశామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ కాదు అని, జాబ్‌లెస్ క్యాలెండర్ గా మారిందని చురకలంటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెప్పించారన్నారు. ఇప్పుడు ప్రజలను మోసం చేశారని, ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. జాబులు నింపమంటే జేబులు నింపుకున్నారన్నారు. నిరుద్యోగ యువత. చేతిలో ఒక అవకాశం ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కమీషన్లు, వసూళ్లు పంపకాల్లో తేడాలు రావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇవ్వాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నిరుద్యోగ యువత ఆలోచన చేయాలన్నారు.