అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై ఎపి హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. టూవీలర్‌ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు 4 బృందాలు పనిచేస్తున్నాయని అనిత వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మృతులకు రూ.5లక్షలు, గాయపడ్డవారికి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ప్రమాదం నుంచి 27 మంది బయటపడ్డారని, 19 మంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రి అనిత వెల్లడించారు.
ప్రమాదానికి గురైన కావెరీ ట్రావెల్స్ బస్సు 2018లో తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించుకొని, 2023లో డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్ ఇండియా పర్మిషన్ తీసుకున్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం రాయగడ్ లో ఆల్ట్రేషన్, పిటినెష్ చేయించుకొని ఒడిశా అధికారులు సిటీంగ్ పర్మిషన్ జారీ చేశారు. 2023లో 43 సీట్ల సిటింగ్ పర్మిషన్ తీసుకొని ఎన్ఒసి డామన్ డయ్యుతో రిజిస్ట్రేషన్ స్లీపర్ కోచ్ గా మర్చినట్టు అధికారులు వివరించారు.