ప్రస్తుతం భారత సినీ ప్రేమికులు మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం #SSMB29. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాల భైరవ సంగీతం అందించిన ‘మోగ్లీ’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా #SSMB29 గురించి కూడా మాట్లాడారు. ఇటీవలే ఈ సినిమా సంగీత కార్యక్రమాలు మొదలైనట్లు తెలిపారు. ‘‘నాన్నగారి సినిమాల్లో వర్క్ ఉంటే, కచ్చితంగా చెబుతారు. ముఖ్యంగా రికార్డింగ్ సెషన్స్‌కి వెళ్తా. SSMB29కు సంబంధించి కూడా మ్యూజిక్ పనులు ఇటీవలే మొదలయ్యాయి. నేను కూడా అందులో భాగమయ్యా’’ అని కాల భైరవ పేర్కొన్నారు. దీంతో మహేశ్ అభఇమానులు సామాజిక మాధ్యమాల్లో సంబురాలు చేసుకుంటున్నారు.