అమరావతి: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రయాణికుల సజీవదహనం అత్యంత విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ ట్వీట్ చేశారు.