హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో క్రేజీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు. జి నిర్మిస్తుండగా హేమ, షాలిని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించనున్నారని మేకర్స్ ప్రకటించారు. ఆమెకు బర్త్ డే విషెష్ అందిస్తూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగనుంది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు.