అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై టిడిపి నేతలు దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు షాపులోని సామాన్లను బయటపడేశారు. తమకు రూ.30వేలు అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలని సాంబశివరావును టిడిపి నేతలు బెదిరించారు. జనసేన నాయకుడు ఎందుకు చెల్లించాలని టిడిపి నేతలను ప్రశ్నించాడు. దీంతో సాంబశివరావుపై టిడిపి నేతలు దాడికి పాల్పడ్డారు. రూ.3 వేల అద్దె చెల్లించాల్సిన షాప్ కి నెల నెల రూ.30 వేలు చెల్లించాలని టిడిపి నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. రోజు రోజుకు టిడిపి నేతల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని సాంబశివరావు భార్య రమ్య ఆరోపణలు చేశారు. జనసేన లేకుండానే టిడిపి ప్రభుత్వంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎంఎల్ఎ దాడి చేయమంటనే సాంబశివరావుపై టిడిపి నేతలు దాడి చేశారని రమ్య ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఒకేసారి డబ్బులు చెల్లిస్తామని, లేకపోతే అధికారులు మా షాపు సీజ్ చేస్తారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థానిక రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వాలంటే ఎలా? కుదురుతుందని ప్రశ్నించారు. షాపు తాళాలు టిడిపి తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.