అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. టేకూరు సమీపంలో ఉల్లిందకొండ వద్ద ప్రైవేటు టావల్స్ బస్సుకు మంటలు అంటుకోవడంతో 25 మందికిపైగా మృతి చెందారు. ఈ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో చిక్కుకున్న మరో 17 మంది ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. డిడి 01 ఎఎన్ 9190 అనే నంబరు గల కావేరీ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసకుుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారని, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం.