ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన
ఈనెల 25న నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ ప్రారంభం
ప్రజల అభిప్రాయం తెలుసుకుంటా..
యాదాద్రి ప్రాశస్తాన్ని కాపాడేలా ప్రభుత్వం ప్రయత్నించాలి
శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న కవిత
మన తెలంగాణ/యాదగిరిగుట్ట: ఒక రాజకీయ పార్టీ పెడితే తన కోసం కాదని..ప్రజలకు మేలు జరగాలని, ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని ఎంఎల్‌సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఈనెల 25 నుం చి దాదాపు నాలుగు నెలల పాటు ‘జనం బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగాకొత్త రాజకీయ పార్టీపై ప్రజల అభిప్రాయం తె లుకుంటానని అన్నారు.
మొన్న తిరుపతి, ఈరోజు యాదగిరిగుట్టకు వచ్చామని, ‘జనం బాట’కు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు కావాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ‘జనం బాట’ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. ‘జనం బాట’లో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటానని అన్నారు. ఈనెల 25న తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచే జనం బా ట కార్యక్రమం ప్రారంభమవుతుందని, 33 జిల్లాల్లో 4 నెలల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతి జిల్లాలో రెండు రోజు ల పాటు ఉండి అక్కడి మేధావులు, విద్యావంతు లు, రైతులు, యువత, మహిళలను కలుసుకొని స మస్యలు తెలుసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలు కోరుకుంటే త ప్పకుండా పార్టీ పెడతానన్నారు. పార్టీలు ఉండడం కాదని, వాటితో ప్రజలకు మేలు జరగాలని అ న్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకే ‘జనం బాట’ కార్యక్రమం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ యాదాద్రిని మహాద్భుతంగా పునర్నిర్మించారని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా యాదాద్రి ప్రాశస్తాన్ని కాపాడే విధంగా ప్రయ త్నం చేయాలని హితవు పలికారు. యాదగిరిగుట్ట వస్తుంటే దారిపొడవునా విచిత్రమైన హోర్డింగ్‌లు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించి ఆలయానికి సంబంధించిన హోర్డింగ్‌లు మాత్రమే పెట్టాలని సూచించారు. మళ్లీ యాదగిరిగుట్టను సందర్శిస్తానని, అప్పుడు ఇప్పటి సమస్యలపై వివరంగా మాట్లాడుతానని అన్నారు.