జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు.
జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.