నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళ జట్టు, న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్ సెమీఫైనల్‌కి వెళ్లే మార్గం సులభమవుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ క్రమంలో భారత ఓపెనర్లు స్మృతి మంధన శతకంతో రాణించగా.. ప్రతీకా రావల్ కూడా సెంచరీతో కదంతొక్కింది. అయితే స్మృతి 109 పరుగులు చేసి సుజీ బేట్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయింది. ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. క్రీజ్‌లో ప్రతీక(107), జెమీమా (15) ఉన్నారు.