హైదరాబాద్: మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ సిఎం రేవంత్ రెడ్డిదే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వకుండా అజారుద్దీన్ ను, సిఎం, మంత్రి మధ్య గొడవలో సీనియర్ ఐఎఎస్ అధికారి సయ్యద్అలీ ముర్తజా రిజ్వీ ను బలి చేశారని విమర్శించారు. ఒక్క ఐఎఎస్ కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. స్మశాన వాటిక విషయంలో జూబ్లీహిల్స్ మైనార్టీలను చేశారని, బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికకు భూమి కేటాయిస్తామని తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కెటిఆర్ సూచించారు.