రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారని శుభవార్త చెప్పారు. ఉపాసన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.దీపావళి తమ ఇంట ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.మొదటి బిడ్డ అయిన క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబంలో ఆనందం నిండిందని, ఇప్పుడు మరో బిడ్డ రాకతో ఆనందం మరింత పెరిగిందని తెలుస్తోందని క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన ఉపాసన ..తన ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయని తెలుపుతూ ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేశారు. ఈ వీడియోలో కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశ్వీరదించారు.