టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పెర్త్ లో గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఆస్ట్రేలియా.. ఇక్కడే చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6.1 ఓవర్ లో కెప్టన్ శుభ్ మన్ గిల్ వికెట్ కొల్పోయింది. బార్ట్ లెట్ బౌలింగ్ లలో భారీ షాట్ కు ప్రయత్నించిన గిల్ మిచెల్ మార్ష్ చేతికి చిక్కడంతో పెవిలియన్ కు చేరాడు. తొలి వన్డేలో మాదిరిగానే విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. 6.5వ ఓవర్ లో బార్ట్ లెట్ బౌలింగ్ లో విరాట్ అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ (13) రోహీత్ శర్మ(26) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పొయి 50 పరుగులు చేసింది.