సెల్ టవర్ పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంద్రప్రదేశ్ లోని కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి బాబు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి అక్కడి నుండి దూకాడు. ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.